పరిశోధక విద్యార్థులకు, అధ్యాపకులకు సువర్ణావకాశం

భారతదేశంలోని సామాజిక మాసపత్రిక లలో అత్యంత అధికసర్క్యులేషన్ కలిగిన సామాజిక జాతీయతెలుగు మాసపత్రిక దళితశక్తి.   ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ సీరియల్‌ నెంబర్‌ ISSN2457-0303ను దళితశక్తి సామాజిక జాతీయ మాసపత్రిక 2018లో పొందింది. ఈ నెండర్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన పరిశోధన పత్రికలకు ఇచ్చేదిగా ఎక్కడైనా గుర్తింపు పొందుతుంది. ప్రత్యేకించి 2009లో సంవత్సరంలో చట్టంగా రూపొందిన యు.జి.సి రెగ్యులేషన్స్‌ ఆన్‌ మినిమమ్‌ క్వాలిఫికేషన్స్‌ ఫర్‌ అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ టీచర్స్‌ అండ్‌ అదర్స్‌, అకడమిక్‌ స్టాఫ్‌ ఇన్‌ యూనివర్శిటీస్‌ అండ్‌ కాలేజ్స్‌ అండ్‌ మెజర్స్‌ ఫర్‌ ద మెయింటెనెన్స్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ ఇన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రకారంISSN ఉన్న పత్రికలలో వ్యాసం పబ్లిష్‌ అయిన అభ్యర్థికి ఉన్నత విద్యలో గాని, పదవులలో గాని, పదోన్నతులలో గాని అకడమిక్‌ ఫర్‌పామన్స్‌ ఇండికేటర్‌ (API) ద్వారా పది మార్కుల నుండి ఇరవై అయిదు మార్కుల వరకు వస్తాయి. ఈ విధంగా మీ అకడమిక్‌ ప్రయోజనాలను పొందవచ్చును. కావున ఈ అవకాశాన్ని పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు దళితశక్తి సామాజిక జాతీయ మాసపత్రిక ద్వారా ఉపయోగించు కోవాల్సిందిగా కోరుతున్నాం. దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అవగాహన కలిగినవారు దళితశక్తి మాసపత్రికలో పని చేసే సువర్ణావకాశం కల్పిస్తుంది.