Welcome

February 2020

image11

పే బ్యాక్‌ టు సొసైటి ఉద్యమకారుడు : డాక్టర్‌ అప్పికట్ల భరత్‌ భూషణ్‌

బాల్యం స్కూల్‌ల్లో, యవ్వనం కాలేజిలో, యుక్తవయస్సు ఉద్యోగంలో దళితులు వివక్ష ఎదుర్కొక తప్పదని జీవితం నేర్పిస్తున్న పాఠం. వీటికి తోడు సమాజం నుండి చీదరింపులు, అణచివేత సర్వ సాధారణంగా మారిపోయింది. ఐఆర్‌టిఎస్‌ దళిత అధికారిగా దక్షిణ మధ్య రైల్వేలో పని చేయడం ప్రారంభించిన నాటినుండి అంచలంచాలుగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని అగ్రకుల దురహాంకారులు ఎన్నో అడ్డంకులు, అవంతరాలు సృష్టించారు. వాటంన్నింటిని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో కార్యదీక్షతో ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అగ్రకుల దురహాంకారులు మనం చేసే ప్రతి పనిని అడ్డుకునేందుకు వివిధ రకాల ఎత్తుగడలు వేసిన వాటన్నింటిని చిత్తుచిత్తుగా చేశారు. దళితులు ఉన్నతాధికారులైన వివక్షలో మాత్రం మినహాయింపు ఉండదాని అగ్రకులాలు భరత్‌ భూషణ్‌ జీవితంలో నిరూపించారు. దక్షిణ మధ్య రైల్వే 53ఏళ్ల చరిత్రలో 33 సంవత్సరాల సర్వీస్‌లో 25 సంవత్సరాలు ఆపరేషన్‌ విభాగంలో తొలి దళిత ఐఆర్‌టిఎస్‌ ఆఫీసర్‌గా డా.భరత్‌ భూషణ్‌ పదవి బాధ్యతలు నిర్వహించి తన ప్రత్యేకత చాటుకున్నారు. తాను పుట్టి పెరిగిన సమాజం స్థితిగతులను అర్థం చేసుకుని ముందుకు సాగారు. దళితులపై అగ్రవర్ణ దురహంకారుల వివక్షకు తోడు మూఢనమ్మకాల సంప్రాదాయాలు, కట్టుబాట్లు, వెలివేత, అణిచివేత, అత్యాచారాలు, భౌతిక దాడులపై ఎదిరించి పోరాడుతూనే ఉన్నారు. మూఢనమ్మకాలకు కర్మ సిద్ధాంతాన్ని జాత చేసి దళితుల బాధలకు కర్మలే కారణమని ఇంకా వివక్షకు, దాడులకు, హత్యలకు గురిచేస్తునే ఉన్నారు. వృత్తిరీత్యా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంతోపాటు సామాజిక అసమానతలపై పోరాటం, పేద విద్యార్థులకు ఆసరాకు ఆర్థిక సహాకారాన్ని అందించడం ''పే బ్యాక్‌ టు ది సోసైటి''ని ఆయన ప్రవృత్తిగా మార్చుకున్నారు. ఆయన ద్వారా లబ్ధిపొందినవారు కూడా పేద విద్యార్థులకు సహాకారాన్ని అందించే బాధ్యత తీసుకోవాలని సూచిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్లిన, ఏ బాధ్యతలు స్వీకరించిన తన సేవ కార్యక్రమాలతో ఆ పదవికే వన్నె తెచ్చారు భరత్‌ భూషణ్‌. చదువొక్కటే అన్నిరకాల అంటరాని తనాల్ని నిర్మూలిస్తుందని విశ్వసిస్తారు. సేవాదక్పధంతో పని చేసే ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులను తయారు చేయాలన్నది పే బ్యాక్‌ టు సొసైటి ఉద్యమకారుడు డాక్టర్‌ అప్పికట్ల భరత్‌ భూషణ్‌ గారి విజన్‌లో మనంలో భాగస్వాములు అవుదాం, ఆధునిక భారత్‌ భవిష్యత్‌ను మార్గనిర్ధేశం చేస్తారని ఆశిద్దాం.... 

Magazine coming soon...

More links...

image12

  •  పరిశోధక విద్యార్థులకు, అధ్యాపకుల  రచనలకు  సువర్ణావకాశం more
  •  ఎస్సీ, ఎస్టీల చట్టాలు, జి.వో.లు అవసరమైన వారు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు more 
  • దళితశక్తి సామాజిక జాతీయ మాసపత్రికలో  పని చేసే సువర్ణావకాశం link  
  • దళితశక్తి సామాజిక జాతీయ మాసపత్రికలో  చందాదారులుగా చేరండి మెంబర్‌షిప్‌ లింక్‌ 
  •  దళితశక్తి సామాజిక జాతీయ తెలుగు మాసపత్రికకు తోడ్పాటును అందించండి more